- రాత్రి 7.30గం||ల నుంచి
డంబ్లిన్: టి20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా మూడు టి20ల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యతలో నిలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో బుధవారం జరిగే మూడో, చివరి టి20లో ఆతిథ్య జట్టును చిత్తు ఓడించాలని చూస్తోంది. తొలి టి20లో వర్షం కారణంగా డక్త్‌వర్త్‌లో 2 పరుగుల తేడాతో నెగ్గినా.. రెండో టి20లో 33పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసియాకప్‌కు ముందు జరిగే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడంతో యువ క్రికెటర్లంతా సమిష్టింగా సత్తాచాటాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దీంతో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన ఆవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్ చివరి మ్యాచ్‌లో చోటు దక్కించుకొనే ఛాన్స్ ఉంది. ఆసియాకప్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన సంజు శాంసన్ తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనెలాఖరునుంచి ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. ఆ టోర్నీకి 17మందితో కూడిన జట్టును బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
జట్లు..
భారత్: బుమ్రా(కెప్టెన్), సంజు(వికెట్‌కీపర్), జైస్వాల్, గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సుందర్, ప్రసిధ్ కృష్ణ, ఆర్ష్‌దీప్, రవి బిష్ణోరు, ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ఆవేశ్ ఖాన్.
ఐర్లాండ్: స్టెర్లింగ్(కెప్టెన్), టక్కెర్(వికెట్ కీపర్), బల్‌బిర్నీ, హారీ టెక్టర్, ఛాఫర్, డోక్రెల్, అడైర్, మెక్‌కర్టీ, యంగ్, లిట్టిల్, వైట్, డెలనీ, హ్యాండ్, అడైర్, వోక్రోమ్.










