ప్రజాశక్తి-అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు అనుమతులను ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం చేయనుంది. పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.