Jun 16,2023 11:52

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : ఇటీవల నెల్లూరులో బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయించుకుని ఇంటికి వచ్చిన మండల ఆర్బికే చైర్మన్‌ అన్నందేవుల చందర్రావును మండలంలోని కేశవరం గ్రామంలో శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్యం తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో రైతులకు, ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, కుడిపూడి భవాని, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.