May 23,2023 16:45

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో జూన్‌ 6 నుంచి 8 వరకు ఆదివాసి సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు గిరిజన సంఘం నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు అప్పలనరస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఆదివాసి సాంస్కతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరకులోయలోని గిరిజన మ్యూజియం ఎదుట సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సాంస్కృతిక సంబరాల్లో ప్రదర్శనలు ఇచ్చే ఔత్సాహిక గిరిజన కళాకారులను జ్ఞాపికలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులు 9491788043, 9490027132 నెంబర్లకు ఫోన్‌చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

2