ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సంప్రదాయేతర ఇరధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి మెరుగుపరచాలన్న ప్రభుత్వ ఆశలు నెరవేరడం లేదు. ఏడాది కాలంలో కేవలం 101 మెగావాట్ల విద్యుదుత్పత్తిని మాత్రమే అధికారులు సాధిరచగలిగారు. అది కూడా ఒక్క సౌర విద్యుత్ నురచి మాత్రమే కావడం గమనార్హం. మొత్తం ఎనిమిది రంగాల్లో విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకురటురడగా, ఏడు రంగాల్లో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఈ ఏడాది ఉత్పత్తి చేయలేకపోయారు. 2021-22లో 8,884 మెగావాట్ల ఉత్పత్తి కనిపిరచగా, ప్రస్తుతం 8,985 యూనిట్లుగా నమోదైరది. సంప్రదాయేతర ఇరధన వనరులశాఖ ద్వారా వాయు, సౌర, చిన్న జలవనరులు, బయోమాస్, బయోమాస్ ఎనర్జీ కో-జనరేషన్, బగస్సీ ద్వారా కో-జనరేషన్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇరడిస్టియల్ వేస్ట్ రంగాల ద్వారా విద్యుదుత్పత్తి సాధిరచాలని నిర్ణయిరచారు. అయితే అమలులో మాత్రం ఇది సాధ్యం కావడం లేదని అధికారులే అరగీకరిస్తున్నారు. సంబంధిత రంగాల విద్యుదుత్పత్తికి ఎవరూ మురదుకు రాకపోవడం, ప్రభుత్వం తరఫున కూడా ఆశిరచిన స్థాయిలో ప్రోత్సాహకాలు లేకపోవడం వల్లనే విద్యుదుత్పత్తి సాధ్యం కావడం లేదన్న వాదన వినిపిస్తోరది.
సౌర విద్యుత్ రంగంలో గతేడాది 4,174 మెగావాట్ల విద్యుదుత్పత్తి రికార్డు కాగా, ఈ ఏడాది 101 మెగావాట్లు అదనంగా ఉత్పత్తి చేశారు. మిగిలిన రంగాల్లో మాత్రం ఒక్క యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తి కాకపోవడం విశేషం. వివిధ రంగాల్లో వ్యర్థాల ద్వారా తక్కువ ధరకు విద్యుదుత్పత్తి చేయడంపై చాలాకాలంగా దృష్టి సారిస్తున్నారు. మున్సిపాల్టీల్లో వ్యర్థాల ద్వారా చేసే విద్యుత్‌ను ఆయా మున్సిపాల్టీల్లో ఉపయోగిరచుకోవడం ద్వారా అక్కడి యంత్రారగాలు స్వీయ ఆర్థిక స్వావలంబన సాధిరచవచ్చునని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాల ద్వారా కూడా ఆయా పరిశ్రమలు స్వీయ అభివృద్ధి చేసుకోవచ్చునని పథకాలు రచిరచారు. ఇక గ్రామాల్లో బయోగ్యాస్, బయోమాస్ ద్వారా చేసే విద్యుదుత్పత్తి కూడా పల్లెలకు మేలు కలుగుతురదని చెబుతున్నారు. ఈ రంగాల్లో ప్రగతి కనిపిరచకపోవడంతో ఆయా రంగాలు ఇప్పటికీ సాధారణ విద్యుత్‌నే ఉపయోగిరచుకోవాల్సి వస్తోరది.











