Oct 02,2023 19:46

'టైగర్‌ నాగేశ్వరరావు' చిత్రం రవితేజ కెరియర్‌లో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. మేము కూడా స్టువర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. 'టైగర్‌ నాగేశ్వరరావు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. ఆ రకంగా ఈ కథ మాకు కొంచెం దగ్గరగా కనెక్ట్‌ అయింది. రవితేజ ఈ క్యారెక్టర్‌కి బాగా యాప్ట్‌ అయ్యారు. ఇందులో యాక్షన్‌ని రియలిస్టిక్‌గా కంపోజ్‌ చేశాం. చీరాల ప్రాంతంలో జీడి తోటల్లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కంపోజ్‌ చేశాం. రవితేజ గారితో ఎన్నో చిత్రాలు చేశాం. ఈ సినిమా మాత్రం మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇందులో ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్రేక్షకులు రియల్‌గా ఫీలౌతారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది. డైరెక్టర్‌ వంశీ మాకు చిన్నప్పటినుండీ తెలుసు. ఈ సినిమా కోసం మూడేళ్ళ పాటు లోతుగా పరిశోధన చేశాడు. స్థానిక ప్రాంతాల్లో తిరిగి ఎన్నో విషయాలు సంగ్రహించాడు. అద్భుతమైన కథని తయారు చేసి చాలా గొప్పగా ప్రజెంట్‌ చేశారు. ఈ సినిమాతో వంశీకి చాలా మంచి పేరువస్తుంది' అంటూ టైగర్‌ నాగేశ్వరరావు' చిత్ర విశేషాలు ముచ్చటించారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌. అక్టోబర్‌ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.