ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ (కాకినాడ) : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. కుటుంబ సభ్యుల బాధ చూడలేక.. వ్యక్తి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం సామర్లకోట మండలంలో జరిగింది. సామర్లకోట మండలం మాధవపట్నం రైల్వే గేటు దగ్గర జగ్గంపేటకు చెందిన మేడిశెట్టి ప్రకాశరావు (65) రైలుకు ఎదురుగా వెళ్లి బలవన్మరణం చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. క్యాన్సర్ కారణంగా జీవించడం కష్టమని, కుటుంబ సభ్యుల బాధను చూడలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










