ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ (తిరుపతి) : తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా చెన్నై వెళ్తున్న పిఎన్.85 డి 4479 బ్లూ కలర్ కారు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పుత్తూరు పట్టణం ఎన్జీవో కాలనీ వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఎక్కింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ... పుత్తూరు పట్టణం ఆర్‌డిఎం మరాఠీ గేటు వద్ద ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా గతంలో ఏర్పాటు చేసిన రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కొంతమేరకు పాడవడంతో, ఎలాంటి సూచిక బోర్డు స్టిక్కర్లు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక అధికారులు గుర్తించి సూచిక బోర్డులు కాని, రోడ్డు డివైడర్‌కు సూచిక బోర్డు స్టిక్కర్లు కాని ఏర్పాటు చేయాలని కోరారు.










