ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ '800' చిత్రం అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముత్తయ్య పాత్రలో మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలవుతోన్న ఈ సినిమాని మొత్తం 1100 థియేటర్లలో విడుదలచేస్తున్నట్లు నిర్మాత శివలెంక ప్రసాద్ తెలిపారు. 'ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ముందుగా మల్టీప్లెక్స్ స్క్రీన్‌ల్లో ఆ తర్వాత థియేటర్లు పెంచుతూ వెళ్తాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది' అని ఈ సందర్భంగా శివలెంక ప్రసాద్ పేర్కొన్నారు.










