న్యూఢిల్లీ: వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 31,000 మంది పైలెట్లు అవసరం అవుతారని అమెరికా విమానయాన తయారీ కంపెనీ బోయింగ్ అంచనా వేసింది. ఎయిర్‌క్రాప్ట్‌లకు భారీగా ఆర్డర్లు పెరుగుతున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్టే పేర్కొన్నారు. మంగళవారం ఆయన సిఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత విమానయాన రంగం వేగంగా పెరుగుతుందన్నారు. 20 ఏళ్లలో ఈ పరిశ్రమకు 26వేల మెకానిక్‌లు అవసరం కావొచ్చన్నారు. గత నెలలో ఎయిరిండియా పలు కంపెనీలకు 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.










