ప్రజాశక్తి-రాజంపేట రూరల్ : ఈనెల 30వ తేదీన ఆదివారం శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీకి సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రత్యేక నరాల వైద్యులు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నాగ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగులు మాను వీధిలోని శ్రీనివాస జువెలర్స్ ఎదురుగా గల తమ ఆసుపత్రి నందు ఈ ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. పక్షవాతం, మెడనొప్పి, నడుము నొప్పులు, భుజము, మడమ నొప్పులు, కీళ్ళ అరుగుదల, కండరాల బలహీనత, కీళ్ళ సంబంధం గాయాలు, కాళ్లు-చేతులు తిమ్మిర్లు, మూతి వంకర, నరాల బలహీనత, పోలియో, అధిక బరువు వంటి సమస్యలతో పాటు ఎముకలు, కీళ్లు, నరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకించి మహిళా వైద్యురాలుచే చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










