- టీ20 బ్యాటర్‌గా సూర్యకుమార్
- 25వ సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్
ముంబయి: సియట్ క్రికెట్ అవార్డుల వేడుకలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఏకంగా మూడు అవార్డులను చేజిక్కించుకున్నాడు. ముంబయిలో జరిగిన 25వ అవార్డుల వేడుకలో శుభ్‌మన్ గిల్ 'సియట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్', 'సియట్ ఇంటర్నేషనల్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్', 'సియట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డులను కైవసం చేసుకున్నాడు. 2022-23 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళా, పురుష క్రికెటర్లను సియట్ సంస్థ మంగళవారం ఘనంగా సత్కరించింది. మాజీ సెలెక్టర్ మదన్ లాల్‌తో పాటు కర్సన్ ఘవ్రీ కూడా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. 'టెస్టు బౌలర్‌గా' ప్రభాత్ జయసూర్య, 'టి20 బ్యాటర్'గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. 'ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్'గా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపాకు 'వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కింది. 'ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ గెలుచుకున్నాడు. 'టెస్టు బ్యాటర్ ఆఫ్ ది ఇయర్'గా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. 'టి20 బౌలర్'గా భువనేశ్వర్ అవార్డు అందుకున్నాడు. 'డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా జలజ్ సక్సేనా నిలిచింది. టి20 ఫార్మాట్‌లో 300 వికెట్లు తీసిన భారత తొలి బౌలర్‌గా యజ్వేంద్ర చాహల్ ఎంపికయ్యాడు. 'బెస్ట్ కోచ్ అవార్డు'ను ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక ్‌కల్లం దక్కించుకున్నాడు. ఈ అవార్డుల వేడుకలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు.










