Apr 19,2023 21:03
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం14 5జి ఆవిష్కరణ

హైదరాబాద్‌ : సామ్‌సంగ్‌ ఇండియా 5జి విభాగంలో 19 విస్తృత మోడళ్లను కలిగి ఉందని ఆ కంపెనీ మెబైల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ వరుణ్‌ సచ్‌దేవా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం14 5జిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.10వేల -20,000 శ్రేణీ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో సామ్‌సంగ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుత ఏడాదిలో 5జిలో కొత్తగా తొమ్మిది ఫోన్లను ఆవిష్కరించామన్నారు. ఎం14ను 50ఎంపి కెమెరా, సెల్పీ కోసం 13ఎంపి కెమెరా, 6000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో, 5ఎస్‌ఎం ప్రాసెసర్‌తో అందుబాటులోకి తెచ్చామన్నారు. 4జిబి, 128 జిబి ధరను రూ.13,490గా, 6జిబి, 128 జిబి ధరను రూ. 14,990గా నిర్ణయించామన్నారు. ఇది ఏప్రిల్‌ 21 నుంచి అన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందన్నారు.