Apr 03,2023 21:34

గూర్గావ్‌ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 15 ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు సామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది. హైదరాబాద్‌ సహా అన్ని కీలక మెట్రో నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నామని పేర్కొంది. వీటిలో సామ్‌సంగ్‌ బహుళ ఉత్పత్తులను ప్రదర్శన, అమ్మకానికి ఉంచనుంది. ఈ స్టోర్లలో వినియోగదారుల కోసం ఉత్కంటభరితమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు రావడంతో పాటుగా దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్‌ ప్రమాణాలను నెలకొల్పనున్నట్లు తెలిపింది.