ఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ 2030 నాటికి కొత్తతరం ఇంధన వ్యాపారాల ద్వారా 10-15 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని ప్రముఖ నివేదిక అంచనా వేసింది. స్వచ్ఛ ఇంధన రంగం రిలయన్స్ వఅద్ధికి మూలస్తంభంగా నిలవనుందని శాన్‌ఫోర్డ్ సి బెర్న్‌స్టెయిన్ నివేదిక తెలిపింది.2030 నాటికి భారత్ త్రిచక్ర వాహన విక్రయాల్లో 80 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్రైవేట్ కార్లలో 30 శాతం విద్యుత్తు వాహనాలే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఛార్జింగ్ మౌలిక వసతులు లేకపోవడం, అందుబాటు ధరలో వాహనాలు దొరక్కపోవడం, బ్యాటరీ సరఫరా వ్యవస్థలు లేకపోవడం వంటి కారణాల వల్ల భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతుందని బెర్న్‌స్టెయిన్ నివేదిక అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారం నుంచి ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెడుతుందని నివేదిక పేర్కొంది.










