Oct 21,2020 23:37

143 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు

21 మార్కెట్‌ యార్డుల్లో కూడా.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం
కనీస మద్ధతు ధరలకు కొనాలని అధికారుల ఆదేశం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలుకు 143 కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 13, సహకార సంఘాల్లో 10, డిసిఎంఎస్‌ ద్వారా 119, ఎఫ్‌పివో కేంద్రం ఒకటి ఏర్పాటు చేయనున్నారు.143 కేంద్రా లకు అదనంగా మరో 21 వ్వవసాయ మార్కెట్‌ యార్డుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణ యించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రూట్‌ మ్యాపింగ్‌ చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణకు సన్నాహాలు జరుగు తున్నాయి. ఈ ఏడాది కనీస మద్ధతు ధరగా గ్ర్రేడ్‌ ఎకు రూ.1880, కామన్‌ వెరయిటీకి రూ.1868గా నిర్ధారించారు. ఈ ధరలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవచ్చునని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ రైతులకు సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన 21 కొనుగోలు కేంద్రాలకు 681 రైతు భరోసా కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. ఒక్కొ కొనుగోలు కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పౌరసరఫరాల , మార్కెటింగ్‌ శాఖలు ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి. కొనుగోలు కేంద్రాల్లో లావాదేవీలను సంబంధిత తహశీల్దార్లు కూడా పర్యవేక్షణ చేయాలి. బాపట్ల మండలంలో బాపట్ల మార్కెట్‌ యార్డు, మారు బ్రోలువారిపాలెం, పాండు రంగాపురం, బత్రిపూడి, గుడిపూడి, నర్సాయపాలెం, చిరు జమ్ములపాలెం, వెస్ట్‌ బాపట్ల, కర్లపాలెం, బుద్ధాం, పేరలీ, గణపవరం, కాకుమాను మండలంలో అప్పాపురం, రేటూరు, తెలగాయపాలెం, చిన్నలింగాయపాలెం, కాకుమాను, నిజాంపట్నం మండలంలో పాలపట్ల, ఆముదాలపల్లి, తోటకూరవారిపాలెం, ప్రజ్ఞాం, గట్టువారిపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలంలో రేపల్లె యార్డు, పిరాట్లంక, పేటేరు, నెల్లూరిపాలెం, భట్టిప్రోలు మండలం భట్టిప్రోలు యార్డు, పల్లెకోన, సూరేపల్లి, పెదపులివర్రు, ఒలేరు, చెరుకపల్లి మండలం గూడవల్లి, రాజోలు, రాంబొట్లపాలెం, పొన్నపల్లి యార్డు, పొన్నూరు మండలం మునిపల్లె, పచ్చలతాడిపర్రు, ములుకుదురు, పొన్నూరు యార్డు, చేబ్రోలు మండలం వడ్లమూడి, మంచాల, చేబ్రోలు, కొల్లూరు మండలంలో కొల్లూరు, అనంతవరం, కాప్ర, ఈపూరు, రావికంపాడు, వేమూరు మండలం చదలవాడ, జంపని, చావలి, పేరూరు వారిపాలెం, వేమూరు యార్డులతో పాటు తెనాలి, దుగ్గిరాల, ఫిరంగిపురం, చిలకలూరిపేట, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు చేస్తారు. వీటితోపాటు నర్సరావుపేట మండలం అల్లూరివారిపాలెం, మండల కేంద్రమైన నూజెండ్ల, బొల్లాపల్లి మండలం వెల్లటూరు యార్డు, ఈపూరు యార్డు, ఏ. ముప్పాళ్ల, మాచర్ల యార్డుతో పాటు కంభంపాడు, తాళ్లపల్లి, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, చింతలపల్లి, రెంటచింతల మండలంలో మార్కెట్‌ యార్డు, గురజాల మార్కెట్‌ యార్డు, జంగమేశ్వరపురం, రెంటాల, మంచికల్లు, దాచేపల్లి మార్కెట్‌ యార్డు పిడుగురాళ్ల మండలంలో కరలాపాడు, వీరాపురం, జానపాడు, కోనంకి, పిడుగురాళ్ల మార్కెట్‌ యార్డు, మాచవరం, నకరికల్లు మండలం చీమలమర్రి, కుంకలగుంట,చలగుండ్ల,చ గుళ్లపల్లి, నకరికల్లు, రాజుపాలం మండలంలో రాజుపాలెం, సత్తెనపల్లి యార్డు, ముప్పాళ్ల, క్రోసూరు యార్డు, అమృతలూరు మండలంలో గోవాడ, తురుమెళ్ల, చుండూరు మండలంలో మోదుకూరు, వేటపాలెం, చుండూరు, వలివేరు, పివిపాలెం మండలంలో చందోలు, రెడ్దిపాలెం, ఖాజీపాలెం, నగరం మండలంలో పరిసవారిపాలెం, మంత్రిపాలెం,చినమట్ల పూడి, ఈదుపల్లి, దూళిపూడి, కొల్లిపర మండలంలో మున్నంగి, వివిధ మండలాల్లో పెదకాకాని, వట్టి చెరుకూరు మంగళగిరి, వేల్పూరు, చినకంచర్ల, నెమలిపురి, బెల్లంకొండ, సాతులూరు, సొలస, అడిగొప్పుల, దుర్గి యార్డు, పెదకూరపాడు, తదితర గ్రామాలు ఉన్నాయి. వీటితోపాటు సొసైటీలు కూడా ఉన్నాయి.