Oct 09,2023 16:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అక్టోబర్6 తేదీ నాడు ఆర్ సి ఎం ఉన్నత పాఠశాల పార్వతీపురం నందు ఎస్ జి ఎఫ్  ఆధ్వర్యంలో  జరిగిన జిల్లాస్థాయి స్టేట్ గేమ్స్  ఫెడరేషన్ ఫెన్సింగ్ క్రీడా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంట్యాడ విద్యార్థులు అత్యున్నత క్రీడా ప్రతిభను ప్రదర్శించి అత్యధిక సంఖ్యలో 9 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు మొత్తం 13 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. పాఠశాల క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్లు పివిఎస్ఎన్ రాజు, బైరెడ్డి శ్రీను ప్రధాన ఉపాధ్యాయురాలు అలజంగి ఝాన్సీ  అభినందించారు. ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడ ఆడటం వలన విద్యార్థులకు శారీరకంగా మానసికంగా మంచి చురుకుదనం మరియు ఏకాగ్రత పెంపొందించబడతాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో మిగతా విద్యార్థులు అందరూ వివిధ క్రీడాలలో పోటీలలో పాల్గొని మంచి విజయాలు సాధించి పాఠశాలకు గ్రామమునకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు