Aug 01,2023 16:34

న్యూయార్క్‌ : ఏఐ టెక్నాలజీతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ తాజా సర్వే బాంబు పేల్చింది. అమెరికాలో జాబ్‌ మార్కెట్‌పై ఏఐ పెను ప్రభావం చూపుతుందని.. ఆర్ధిక ఆటోమేషన్‌కు ఏఐ దారితీస్తుందని 2030 నాటికి అమెరికా ఆర్ధిక వ్యవస్థలో ఏఐ బలమైన శక్తిగా అవతరిస్తుందని ఈ సర్వే తెలిపింది. ఆటోమేషన్‌, డేటా కలెక్షన్‌ వంటి ఉద్యోగాలను ఏఐ సమర్ధంగా రీప్లేస్‌ చేస్తుందని.. ఆఫీస్‌ సపోర్ట్‌, కస్టమర్‌ సర్వీస్‌, ఫుడ్‌ సర్వీస్‌ ఎంప్లారుమెంట్‌ వంటి పలు రంగాల్లో ఉద్యోగాలు ఏఐతో ప్రభావితమవుతాయని తెలిపింది. 1,60,000 క్లరికల్‌ ఉద్యోగాలు, 8,30,000 రిటైల్‌ సేల్స్‌పర్సన్‌ ఉద్యోగాలు, ఏడు లక్షలకుపైగా అడ్మిన్‌ జాబ్స్‌, ఆరు లక్షలకు పైగా క్యాషియర్‌ ఉద్యోగాలు కనుమరుగవుతాయని మెకిన్సే సర్వే వెల్లడించింది. ఇప్పటికే చాట్‌జీపీటీతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతుండగా 1.8 లక్షల మంది ఉద్యోగులు 2030 నాటికి వేరే జాబ్‌లను వెతుక్కుంటూ విభిన్న రంగాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అంచనా వేసింది.