
ఐరాసలో మోడీ ప్రభుత్వ వైఖరికి ఖండన
ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లను అడ్డుకోవాలి
నవంబరు 26ా28 దేశవ్యాపిత కిసాన్‌ామజ్దూర్ మహాపడావ్‌కు మద్దతు
డిసెంబరు 4న దళిత సంఘాల పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు
న్యూఢిల్లీ : మారణహౌమంతో కూడిన ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా, మాతృభూమి కోసం పాలస్తీనా ప్రజలు సాగిస్తున్న పోరాటానికి పెద్దయెత్తున సంఘీభావం తెలపాలని ఈ నెల 27, 29 తేదీల్లో న్యూఢిల్లీలో స మావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ పార్టీ తన శాఖలన్నిటికీ పిలుపునిచ్చింది. విద్యుత్తును ప్రైవేటీకరించేందుకు విద్యుత్ వినియోగదారులకు ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలని అది ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నవంబరు 26-28 తేదీల మధ్య జరపతలపెట్టనున్న దేశవ్యాపిత కిసాన్- మజ్దూర్ మహాపడావ్‌కు కేంద్ర కమిటీ తన పూర్తి మద్దతు ప్రకటించింది. అలాగే డిసెంబరు4న దళిత సంఘాలు, వేదికలు పార్లమెంటు మార్చ్‌కు ఇచ్చిన పిలుపునకు అది తన మద్దతు ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించింది. కేంద్ర కమిటీ సమావేశ నిర్ణయాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం నాడిక్కడ ప్రకటన రూపంలో విడుదలజేశారు. ఆ వివరాలు...
కేరళలో బాంబు పేలుడు
ఎర్నాకులంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. రాష్ట్ర పోలీసులు ఒక అనుమానితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవాలు నిర్ధారించకుండా, కేరళకు, కేరళ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో మతోన్మాద వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్ర కమిటీ ఖండించింది. కేరళకు గల విశిష్టమైన, అసామాన్యమైన సామాజిక, మత సామరస్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై గట్టిగా గళం వినిపించాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రజలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
మణిపూర్
మణిపూర్‌లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతునే వుంది. అక్కడ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో మోడీ ప్రభుత్వం, బిజెపి డబుల్ ఇంజను ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని దీంతో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో జాతుల మధ్య చోటు చేసుకుంటున్న చీలికలు, విభేదాలకు మతం రంగు పులుముతున్నారు.
అధికారికంగా, మృతుల సంఖ్య 175గా రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. (వాస్తవానికి, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ వుంటుంది) 96మంది మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి వుందని చెబుతున్నారు. మరో 32మంది గల్లంతైనట్లు అధికారికంగా ప్రకటించారు. 4,786 ఇళ్ళు, 386 మతపరమైన స్థలాలతో సహా మొత్తంగా 5,172 గృహ దహనాల కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు పేర్కొం టున్నాయి. 5,668 ఆయుధాలు లూటీ అవగా, కేవలం 1329ని మాత్రమే స్వాధీనం చేసుకో గలిగారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించి, మణిపూర్‌లో కల్లోలాన్ని అరికట్టాలి.
ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు
మోడీ ప్రచార యంత్రాంగం సాగిస్తున్న తప్పుడు ప్రచార బుడగ పేలిపోయింది , అడ్డు అదుపు లేని ధరల పెరుగుదల, అంతులేని నిరుద్యోగం వెరసి ప్రజల ఆదాయాలు తీవ్రంగా క్షీణించడానికి దారి తీశాయి. కుటుంబ ఆర్థిక ఆస్తులు 2020-21లో జిడిపిలో 11.5శాతంగా వుండగా, 2022-23 నాటికి వచ్చేసరికి 5.1శాతానికి పడిపోయాయి. ఇది కుటుంబాల రుణ భారంలో తీవ్ర పెరుగుదలకు దారి తీస్తోంది.
ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండడం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత గ్రామీణ దుస్థితికి దారి తీస్తోంది. అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్ స్థానం 125 దేశాల్లో 111 కనిష్ట స్థాయికి పడిపోయింది.
పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ మారణహౌమం
మానవతా రీతిలో స్పందించి కాల్పుల విరమణ పాటించాలని, పౌరులందరికీ రక్షణ కల్పించి, వారికి తక్షణమే మానవతా సాయం అందించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తెచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గనడానికి మోడీ ప్రభుత్వం మొండిగా తిరస్కరించడాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మోడీ ప్రభుత్వం ఓటింగ్‌కు గైర్హాజరై, సామ్రాజ్యవాద యుద్దోన్మాదులతో జతగట్టడం, ఇంతకాలం పాలస్తీనావాదానికి మద్దతు ఇస్తూ వస్తున్న భారత దేశ చరిత్ర, సంప్రదాయాలకు విరుద్ధం. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిన డిమాండ్‌కు కేంద్ర కమిటీ మద్దతుగా నిలుస్తుందని, అలాగే అన్ని అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా బాధిత పాలస్తీనియన్లు చేస్తున్న పోరాటానికి కేంద్ర కమిటీ తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు అధికారికంగా, 8వేల మంది మరణించారు. ఇందులో 4000మంది చిన్నారులే, రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గాజాలోనే కాకుండా వెస్ట్ బ్యాంక్‌లో కూడా మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలస్తున్నాయి. తక్షణమే ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించాలని, 1967కి ముందున్న సరిహద్దులతో తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన రెండు దేశాల పరిష్కారాన్ని అమలు చేయాలని ఒత్తిడి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజా నిరసనలు, ఆందోళనల్లో సిపిఎం కూడా పాలుపంచుకుంటుందని తెలిపింది.
ఒక దేశం ఒక ఎన్నిక
ఒక దేశం ఒక ఎన్నిక ప్రతిపాదన అమలును పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పుడు రాజకీయపార్టీల అభిప్రాయాన్ని కోరుతోంది. కొద్ది మాసాల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని వచ్చే ఏడాది జనవరి 18కల్లా రాతపూర్వకంగా రాజకీయ పార్టీల వైఖరిని తెలియచేయాల్సిందిగా కోరింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్ర కమిటీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. ఈ ప్రతిపాదన మన రాజ్యాంగంలో రూపొందించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై జంట దాడులకు దిగడమేనని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలతో బాటు కలిపి ఒకేసారి జరిపేలా రాజ్యాంగానికి ముఖ్యమైన సవరణలు చేయడంతో బాటు తీసుకొచ్చే ఈ ప్రతిపాదన రాష్ట్రాల అసెంబ్లీల ఆయుష్షును కుదించడం లేదా పొడిగించడమే అవుతుంది. సభలో మెజారిటీని ప్రభుత్వం కోల్పోయినపుడు దాన్ని కొనసాగించడం చట్టవిరుద్ధం. కేంద్ర పాలన విధిస్తే, ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలకు గల హక్కును నిరాకరించడమంటే ప్రజాస్వామ్య విరుద్ధమే.
కుల గణన
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న, 2021 సాధారణ జనాభా లెక్కలతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక ప్రతిపత్తులను కూడా మదింపు వేసేలా కుల గణన నిర్వహించాలని కేంద్ర కమిటీ మోడీ ప్రభుత్వాన్ని కోరింది. రిజర్వేషన్లతో పాటు చట్టపరమైన హక్కులు అర్హులైన వారందరికీ అందేలా చూడాలంటే ఇటువంటి కుల గణన చాలా అవసరం. బీహార్‌లో రాష్ట్ర స్థాయి కుల సర్వే నిర్వహించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పని చేయనున్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయి సర్వేలు నిర్వహించడంపై నిర్ణయమనేది ఆయా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల విశేషాధికారం. అయితే, అఖిల భారత కుల గణనకు ఇది ఎంత మాత్రమూ ప్రత్యామ్నాయం కాజాలదు. ప్రజల అర్హతలను నిర్ధారించడానికి ఈ కుల గణన అనేది ముఖ్యమైన ప్రాతిపదిక.
కేంద్ర కమిటీ పిలుపు
మాతృభూమి కోసం, ఇజ్రాయిల్ మారణకాండతో కూడిన దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు జరుపుతున్న పోరాటానికి సంఘీభావ కార్యక్రమాలను ఉధృతం చేయాలని పార్టీ శాఖలన్నింటికీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. విద్యుత్‌ను ప్రైవేటీ కరించేందుకు గానూ విద్యుత్ వినియోగదారులకు ప్రీ పెయిడ్ స్టార్ట్ మీటర్లు బిగించే యత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తోంది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు గరిష్ట లాభాలు చేకూర్చిపెట్టేందుకు విద్యుదుత్పత్తిని అప్పగించడం వల్ల , వాటి రేట్లు బాగా పెరిగిపోయి ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయి. ముఖ్యంగా నిరుపేదలు, రైతులపై భరించలేనంతగా భారాలు మోపబడతాయి. ఎక్కడైతే ఈ మీటర్లను పెడుతున్నారో అక్కడ వాటి ఏర్పాటును అడ్డుకునేందుకు నిరసన కార్యాచరణ చేపట్టాలి. నవంబరు 26-28 మధ్య దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కిసాన్‌ామజ్దూర్ మహాపడావ్‌కు పార్టీ మద్దతునివ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. డిసెంబరు 4న దళిత సంఘాలు, దళిత వేదికలు ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంట్ మార్చ్‌కు పార్టీ తోడ్పాటును, సంఘీభావాన్ని ప్రకటించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.