Nov 18,2022 15:33

ప్రజాశక్తి-నర్సీపట్నం : నర్సీపట్నం కలాసి కాలనీకు చెందిన దిలిప్(26 వయసు) యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సీపట్నం చింతపల్లి రోడ్డు మార్గంలో జూనియర్ కాలేజీ సమీపంలో పంట పొలంలో టేకు చెట్టుకు చీర కట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు బాధ తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని  సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.