Jul 07,2023 21:52

ప్రజాశక్తి-కమలాపురం : స్థానిక మార్కెట్ యార్డ్ పరిధిలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చంద్ర అనే యువకుడు మృతి చెందాడు. మార్కెట్ యార్డ్ ఆవరణలో ట్యాంక్ నిర్మాణ పనుల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది యువకుడిని తనతోటి కూలీలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లగా డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపాడు. గత నెలరోజుల నుండి ఇక్కడ జరుగుతున్న పనిలో అక్రమంగా విద్యుత్ వాడుతున్న పటించుకొని అధికారులు ప్రమాదం జరగగానే అక్రమంగా విద్యుత్ వాడుతున్న తీగలు తొలగించారు. నిజానిజాలు బయటకు రాకుండా అధికార పార్టీకి చెందిన నాయకుడు పోలీసులను, అధికారులను మ్యానేజ్ చేసినట్లు వినికిడి.