Apr 30,2023 15:31
  • పోయేకాలం దగ్గర పడింది 
  • మీరు కాలువలు, గుంటలు, స్మశానాలు ఆక్రమణలు చేసి బిల్డింగులు కట్టుకుంటారు..         ‌
  •  గాలి భాను ప్రకాష్ 

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రాత్రి నోటిసిచ్చి పొద్దున్నే ఉన్న పళాన, ఎలాంటి ప్రత్యాన్మాయం చూపకుండా జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చడంపై  భాను ప్రకాష్. మండిపడ్డారు. పట్టణంలోని స్థానిక సదాశివ స్వామి ప్రక్కన నివాసమున్న పేదవారి గుడిసెలను కూల్చేసిన ఆదివారం పరిశీలించి బాధ్యతలతో మాట్లాడుతూ తన తండ్రి ముద్దు కృష్ణమనాయుడు 40 ఏండ్లుగా పేద ప్రజలకు రక్షణ కవచంలా వున్నారు, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా జెసీబీలు పెట్టి పేదల ఇండ్లను కూల్చేయూడంలో బిజీగా వున్నారని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు ఈశ్వరాలయం చుట్టు 40 ఏండ్లుగా నివాసం వుంటున్న పేదల ఇండ్లను తొలగించిన స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించి, ధైర్యం తమకు గడువు ఇవ్వకుండానే, ప్రతామ్నాఇయం చూపకుండానే తమ ఇండ్లు కూల్చేసారని కన్నీరు పెట్టి విలపించిన బాధితులు..బాధితుల కంట వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు బాధ్యులు మూల్యం చెల్లిస్తారు. 'నిరుపేదల ఇళ్లను. కుల్చడాన్ని అభివృద్ధి అంటారా..పేదల పైనా మీ ప్రతాపం... పేదల ఇండ్లు కూల్చడంపై ఆగ్రహం బాధితులు ప్రత్యామ్నాయం చూసుకోవడానికి నాలుగు రోజులు గడువు ఇవ్వలేరా... అధికార దుర్వినియోగానికి, అహంకారానికి ఇది పరాకాష్ట. బాధితులకు అండగా ఉంటాం కొన్ని నెలలు ఆగండి... వచ్చేది మన టీడీపీ ప్రభుత్వమే..మీ కుటుంబంలో ఒకడిగా మిమ్మల్ని ఆదుకుంటాను' అని  తెలిపారు. ఈ కార్యక్రమంలో. చిత్తూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి. చిత్తూరు పార్లమంటే టి ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు రావిళ్ళ మాధవ నాయుడు. రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు డిఎస్ గణేష్.. మాజీ చైర్మన్ బి సి ఆర్ యుగంధర్. పట్టణ ప్రధాన కార్యదర్శి ధనపాల్. అశోక్ కుమార్. మోహన్. బాలి రెడ్డి. ఎలుమల రెడ్డి. టిడిపి నాయకులు పాల్గొన్నారు.