Oct 21,2023 11:46
  • ఆలూరు సాంబశివ రెడ్డి.....

ప్రజాశక్తి-నార్పల : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వివిధ వర్గాలకు చేసిన మేలును ప్రజలకి తెలియజేసి ఈనెల 26న బుక్కరాయసముద్రంలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రభుత్వ విద్య సలహాదారు సాంబశివరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రం లోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింయయ్య  అధ్యక్షతన నార్పల మండల వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివిధ వర్గాలకు సమీకరణాల రీత్యా ఇచ్చిన రాజకీయ ఆర్థిక సాంఘిక ప్రాధాన్యత ప్రభుత్వ  పథకాలు, తదితర సంక్షేమ పథకాలు కార్యక్రమాల గురించి ప్రజలకు సవివరంగా వివరించి 2024 లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసుకోవలసిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్త పైన ఉంది అని ఈ నెల 26 న బుక్కరాయ సముద్రం లో ప్రారంభం అయ్యే సాధికారిక బస్సు యాత్రకు నార్పల మండలం నుండి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్ని వర్గాల వారికి మాత్రమే మేలు చేసిందని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాకాకుండా పార్టీలు వర్గాలు కులాలు, మతాలకతీతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని దీని ప్రజల్లో తీసుకొని వెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు ఈ సమావేశంలో వైసిపి సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి ఎంఈఎంఎస్ రాష్ట్ర డైరెక్టర్ నార్పల మండల వైసీపీ కన్వీనర్ నిట్టూరు రఘునాథరెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ ఎంపీపీ నాగేశ్వరరావు సింగల్ విండో చైర్మన్ లోకనాథ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప మాజీ మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ కేశవరెడ్డి మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ నాగలింగారెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమీర్ భాష మండల కో ఆప్షన్ నెంబర్ సాబీర ఉప సర్పంచ్ శ్రీరాములు వైసీపీ నాయకులు భాస్కర్ నాయుడు భాస్కర్ రెడ్డి దాడి తోట భాష మనీలా శివయ్య రమేష్ గోపాల్ శేఖర్ రెడ్డి ఎంపీటీసీ గొల్లపల్లి శంకర్ కాటమయ్య రాజారెడ్డి పద్మాకర్ రెడ్డి వైసీపీ నాయకులు రంగారెడ్డి నరసింహులు శివ శంకర్ రెడ్డి గోపాల్ రెడ్డి భాస్కర్ రెడ్డి పక్కి రెడ్డి ముచ్చుకుంటపల్లి నారాయణరెడ్డి దుగుమరి నారాయణరెడ్డి కాటమయ్య మల్లికార్జున వెంకటరాముడు  సర్పంచులు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు