Jun 04,2023 22:30

ప్రజాశక్తి కాకినాడ రూరల్‌ యువతరంపై ఎక్కువ ప్రభావం చూపిన ఆరుద్ర అభ్యుదయ కవి అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ శిరీష పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో ఆరుద్ర వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఆరుద్ర ఒకరని అన్నారు. వందలాది గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోదక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు ఎన్నో రచనలు ఆయన చేశారన్నారు. దాదాపు నాలుగు వేల పైచిలుకు సినిమా పాటలను ఆయన రాశారని అన్నారు. అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీమూర్తుల్లో ఆరుద్ర ఒకరని అన్నారు. కవిత్వం, పరిశోధన రెండింటిని వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు, హేతువాది ఆరుద్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్‌, రాజా, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, బివిఎస్‌.ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.