Jan 13,2023 00:28

కె.కోటపాడులో నివాళులర్పిస్తున్న పైలా, పాత్రికేయులు

ప్రజాశక్తి-అనకాపల్లి
స్వామి వివేకానంద నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. వివేకనంద 121 జయంతి సందర్భంగా గురువారం గొల్ల వీధిలో వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత వివేకానందునికే దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోడి వెంకటరావు, కోట్ని రాంబాబు, మారిశెట్టి శంకర్రావు, బొడ్డేడ మురళి, కాండ్రేగుల సత్యనారాయణ, పొలిమేర ఆనంద్‌, బర్నికాన శ్రీనివాసరావు, వి రమణ బాబు, బి భువనేశ్వరరావు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పివి రమణ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు స్పూర్తినిచ్చే అధ్యాత్మక గురువు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, వాలంటీర్లు చందు నారాయణమూర్తి పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పైలా ఫౌండేషన్‌ అధినేత పైలా ప్రసాదరావు అన్నారు. గురువారం స్థానిక షిరిడి సాయిబాబా ఆలయం ప్రాంగణంలో కె.కోటపాడు ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన వివేకానంద 160వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పైలా ప్రసాద్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కుబిరెడ్డి రాధాకృష్ణలను శాలువాతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యలమంచిలి ధర్మారావు, నేమాల సతీష్‌, కుబిరెడ్డి సన్నిబాబు, గజ్జిబాల గంగాధర్‌, నీలి శ్రీనివాసరావు, శిలపరశెట్టి వెంకట్రావు, వేగి రామారావు, నాయకులు బండారు నరసింహనాయుడు, వెలగల పైడం నాయుడు, ఫ్యాషన్‌ టెక్నాలజీ శ్రీనివాసరావు, భూపతి అప్పలరాజు, గజ్జి అప్పలనాయుడు, బండారు గడ్డి బాబు, పిల్లల రమణ, వేగి ఆదినారాయణ పాల్గొన్నారు.
వడ్డాది : స్వామి వివేకనంద మాటలు ప్రగతికి బాటలు అని అతిధి దేవోభవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు ఆరిపాక కామేశ్వరరావు అన్నారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది కేఏడి జడ్పీ హైస్కూల్లో గురువారం వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, పేదలకు వస్త్రాలు దానం చేశారు. వడ్డాది, దిబ్బిడి, కేజి.పురం, చిన్న అప్పన్నపాలెం, వీరవెల్లి అగ్రహారం, బంగారు మెట్ట, ఎల్‌బిపి.అగ్రహారం, విఆర్‌ఆర్‌ పేట గ్రామాల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు డాక్టర్‌ దుర్గేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలోని చినదొడ్డిగల్లు శాఖ గ్రంధాలయంలో గురువారం గ్రంధాలయాధికారి కె.జనార్దన్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160 జయంతిని నిర్వహించారు. స్వామి వివేకానందుని చిత్రపటానికి ఉపాధ్యాయులు సతీష్‌ పూలమాలవేసి నివాళులర్పించారు..వివేకానందుని జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గ్రంధాలయ అభివద్ధి కమిటీ చైర్మన్‌ ఏ. అప్పలరాజు, సిబ్బంది వి. రమణమ్మ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: స్థానిక శాఖా గ్రంధాలయంలో వివేకానందుని చిత్రపటానికి లైబ్రేరియన్‌ దమయంతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్‌పి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు నారాయణరావు పాల్గొని, వివేకానందుని ఆశయాలు, ఆదర్శాలను వివరించారు. ఇన్‌ఛార్జి లైబ్రేరియన్‌ రాజబాబ, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలను బహూకరించారు.
ఎస్‌ రాయవరం : యువత ఉజ్జ్వల భవిష్యత్తుకు వివేకానందుడి జీవితం ఆదర్శంగా నిలుస్తుందని రామకృష్ణ సేవాసమితి ఆర్గనైజర్‌ కొరుప్రోలు రమణ అన్నారు. గురువారం ధర్మవరంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సమితి వైస్‌ ప్రెసిడెంట్‌ కలిగట్ల మాణిక్యం,మాజీ వైస్‌ప్రెసిడెంట్‌ సియ్యాదుల అచ్యుత్‌కుమార్‌ (నాని), పడాల మణికంఠ, బత్తిన అప్పారావు పాల్గొన్నారు.
గొలుగొండ : పాతకృష్ణదేవిపేటలో స్వామి వివేకానంద జయంతిని సర్పంచ్‌ పందిరి సత్యంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ గ్రామ యువకులు పాల్గొన్నారు.