Oct 13,2023 00:07

కిట్లును అందజేస్తున సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో మారుమూల పంచాయతీలైన కుమడ, బూసిపుట్టు పరిధిలో స్థానిక ఎస్సై రవీంద ఆధ్వర్యాన సిఆర్పిఎఫ్‌ బెటాలియన్స్‌ పర్యటించాయి. .గిరిజనులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలలో యువత పాల్గొన వద్దని ఎస్‌ఐ సూచించారు. ప్రలోభాలకు గురై అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి సాగు, రవాణా, పైలెటింగ్‌ తదితర కార్యకలాపాలలో యువత అధికంగా మొగ్గు చూపుతుందని, ఇది చట్టరీత్యా నేర మన్నారు.సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పులబండ, కెందుగూడ, సుల్తాన్‌పుట్‌లో తాగునీటి సమస్య అధికంగా ఉందని స్థానిక ఎస్సై రవీంద్రకు ప్రజలు తెలిపారు. యువతకు వాలీ బాల్‌కిట్‌లను స్థానిక ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.