Apr 20,2023 20:03

ఆదోనిలో మాట్లాడుతున్న గౌస్‌ దేశాయి

ప్రజాశక్తి - ఆదోని
కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశాయి డిమాండ్‌ చేశారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గురువారం 7వ రోజు ప్రచార భేరి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కార్వన్‌ పేట, తిక్కస్వామి దర్గా ప్రాంతాల్లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శులు లక్ష్మన్న, సుదర్శన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌస్‌ దేశాయి మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని విమర్శించారు. నాయకులు గోపాల్‌, ఎంకప్ప, తిప్పన్న, ఒబి.నాగరాజు, వీరేష్‌, ప్రకాష్‌, నాగరాజు, రాజు, నాగేంద్ర, షేక్షావలీ, షాబీర్‌ బాష, అంజి పాల్గొన్నారు. కౌతాళం మండలంలోని ఎరిగేరి, తోవి, బదినేహల్‌, కుంటనహళ్‌ గ్రామాల్లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు మల్లయ్య, మండల కన్వీనర్‌ వీరన్న, సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న, శంకర్‌, వలీ, చాంద్‌ బాష, శంకర, ఈరన్న పాల్గొన్నారు. కోసిగి (రూరల్‌)లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార భేరి నిర్వహించారు. ఆర్‌టిసి బస్టాండ్‌ కూడలిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు మాట్లాడారు. సిపిఎం మండల కన్వీనర్‌ రాముడు, ప్రజాశక్తి రంగయ్య, మండల నాయకులు వీరేష్‌, గోపాల్‌, వెంకటేష్‌, కర్రెప్ప, నరసింహులు, చిన్నన్న, రాజు, హనుమంతు, రాము పాల్గొన్నారు.