Sep 03,2023 18:13

షాపింగ్‌ మాల్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి

ప్రజాశక్తి -వెంకటాచలం : యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సంబంధిత రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు గ్రామంలో వసంతలక్ష్మి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంఎస్‌ఎంఈ పధకం కింద రూ. 8.27 కోట్లతో నిర్మించనున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ , విఎల్‌ షాపింగ్‌ మాల్‌ కు ఆదివారం మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్‌ రెడ్డి మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ యువతకు మరింత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనతో పాటు నైపుణ్యాభివద్ధిని పెంపొందించేలా కషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సంబంధిత రంగాల్లో నైపుణ్యం ఉన్నప్పుడే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాకుటూరు గ్రామంలో 8.27 రూ. కోట్లతో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌తో పాటు పాటు ఆ రంగంలో యువతకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు అమలు జరిగేలా కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ నిర్మాణం, తయారైన వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేలా షాపింగ్‌ మాల్‌ను నిర్మించడం అభినందనీ యమన్నారు. అనంతరం మంత్రి కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జిల్లా పరిశ్ర మల శాఖ జీఎం సుధాకర్‌, వసంతలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు వసంత లక్ష్మి, రవి కుమార్‌, వెంకటాచలం మండల మాజీ జడ్పిటిసి వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వసంతలక్ష్మి ఛారి టబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.