Sep 28,2023 22:06

ఘనంగా 116వ జయంతి
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
   భగత్‌సింగ్‌ ఆశయాలు నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం నాయకులు ఎన్‌వి.అప్పారావు తెలిపారు. గురువారం భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా స్థానిక భగత్‌సింగ్‌ నగర్‌లో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితరం యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెలటూరి నిర్మల, కెచ్చల రమణ, కాలనీ కమిటీ సభ్యులు అక్బర్‌, సీత, మణి, సూర్యకుమారి, రామకృష్ణ పాల్గొన్నారు.
చింతలపూడి : భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అఖిలభారత యువజన సమైక్య ఎఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ తొర్లపాటిరాజు తెలిపారు. భగత్‌సింగ్‌ 116వ జయంతి సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులో స్వాతంత్ర పోరాటంలో దేశంలో యువతను ఆకర్షించి, పోరాట మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి భగత్‌ సింగ్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన సమైక్య ఎఐవైఎఫ్‌ మాజీ నాయకులు కంచర్ల గురవయ్య, తొర్లపాటి బాబు, గట్టు వెంకటేశ్వరరావు, ఎఐవైఎఫ్‌ నాయకులు బొల్లవరపు విజయ శేఖర్‌, బత్తుల రఘు, బొంతు నవీన్‌ నివాళులర్పించారు.