Jul 04,2023 21:22

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కడప : స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఈ తరం యువతకు ఆదర్శనీయమని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ స్పందన హాలులో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ ముఖ్య అతిధులతో హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి సమాజానికి.. అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయం అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్య్రం వస్తుందని నమ్మి, అందుకోసం తన ప్రాణాలర్పించిన యోధుడన్నారు. ప్రతి ఏడాది జూన్‌ 27 నుంచి జూలై 4వ వరకు అన్ని విద్య సంస్థల్లో పలురకాల సాంస్కతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తత్వపు పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తారని చెప్పారు. అంతకుముందు సమావేశానికి ఆహాజరైన ముఖ్య అతిధులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిపిఒ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా సాంస్కతిక పర్యాటక శాఖాధికారి మల్లికార్జున, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యా సంఘం కార్యాలయంలో అల్లూరి జయంతి వేడకలు నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌ బాబు, కార్యదర్శులు కష్ణా నాయక్‌, జయరాం పాల్గొన్నారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో.. మన్యం వీరుడు, విప్లవ యోధుడు బ్రిటీషు సామ్రాజ్యంపై ఎక్కుపెట్టిన ధీరుడు అల్లూరి.సీతారామరాజు అని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. వ అల్లూరి జయంతి ని పురస్కరించుకుని డివైఎఫ్‌ఐ ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో పాత బస్టాండ్‌ జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్‌ నాయక్‌, సగిలి. రాజేంద్ర ప్రసాద్‌, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు షాకీర్‌, జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌ రాజ్‌, రెబ్బా.నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ సురేష్‌ నాయక్‌, మనోజ్‌, డివైఎఫ్‌ఐ సురేంద్ర పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఉత్తన్న, అమర్‌, రామకష్ణ, నరసింహరెడ్డి, బద్రి, రాఘవయ్య, రవి, శివారెడ్డి, బాలం సుబ్బరాయుడు, నామా వినరు, సుబ్రమణ్యం, ఆరుశేర్ల సుబ్బరాయుడు పాల్గొన్నారు. ముద్దనూరు : స్థానిక వైసిపి కార్యాలయంలో మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మండల కన్వీనర్‌ శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జయరాం నాయుడు,సిద్దు,సుబ్బయ్య, సురేంద్ర నాయుడు, రమణా, రామకష్ణ రెడ్డి, వాసు, రామసుబ్బయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె : దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతి కొద్ది మందిలో అల్లూరి సీతారామరాజు ఒకరని కెవికె సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య పేర్కొన్నారు, స్థానిక కషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ మురళీకష్ణ, కెవికె శాస్త్రవేత్తలు శిల్పకళ, డాక్టర్‌ మహేష్‌ బాబు, ప్రశాంతి, మహేశ్వరి, సాయి మహేశ్వరి, మానస, రామలక్ష్మి దేవి, ప్రత్యూష పాల్గొన్నారు.