ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
వివేకానంద స్వామి నేటి యువతకు ఆదర్శప్రాయం అని జనవిజ్ఞానవేదిక జిల్లా కన్వీనర్, క్రాంతి కాన్వెంట్ కరస్పాండెంట్ వెనిగళ్ల మురళీమోహన్ అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు పురస్కరించుకొని విశాఖపట్నంకు చెందిన యోగ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వివేకానంద జీవిత చరిత్ర ఆయన ఆశయాలపై కొండపల్లి క్రాంతి హైస్కూల్లో రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను కొండపల్లి మాజీ సర్పంచ్ వెనిగళ్ల అమ్మాజీ ప్రారంభించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు స్వామి వివేకానంద ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను నేటి యువతరం పాటించాలని సూచించారు. అనంతరం 110 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు.










