Oct 17,2022 23:17

పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న డాక్టర్‌ నిర్మల

ప్రజాశక్తి -కంచరపాలెం : సేవా కార్యక్రమాల్లో యువత ముందంజలో ఉండాలని, యువత తలచుకుంటే చేయలేనిది, సాధించలేనిదంటూ ఏదీ ఉండదని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అన్నెపు నిర్మల అన్నారు. సోమవారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అవినాష్‌స్వామి ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆర్థికసాయంతో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్‌టిసి, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో పేదలకు ఆహార పంపిణీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ నిర్మల మాట్లాడుతూ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొనడం అభినందనీయమన్నారు. డివైఎఫ్‌ఐ ప్రతినిధులు భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ఆహార సూచీల్లో మనదేశ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ప్రజలందరి ఆహార భద్రత బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కార్యక్రమంలో అవినాష్‌ సావే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కూన వెంకటరావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు, కన్వీనర్‌ విజయ, కంచరపాలెం జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, శ్రావణ్‌, నాయకులు మురళి, రాజశేఖర్‌ శరత్‌, రాజా, హరి, ఐద్వా నాయకులు జనార్ధనమ్మ, శ్రీదేవి, విసిసి ప్రతినిధులు నిమిత్‌, చేగువేరా పాల్గొన్నారు.