
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :యువత టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని, సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని మరింత విస్తతం చేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. సోషల్ మీడియా విస్తరణలో భాగంగా నర్సీపట్నంలో కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజరు నేతత్వంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా యువసేన రాజేష్ హాజరయ్యారు. ముందుగా స్థానిక కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ప్రచారంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు.రాష్ట్ర భవిష్యత్తుకు సోషల్ మీడియాను యువత ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోడి కత్తి డ్రామా నుండి గొడ్డలి పోటు వరకు అనేక డ్రామాలాడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అధికారం చెల్లినట్లేనని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే అనుచరగనం రంగురాళ్ల తవ్వకాలకు, గంజా వ్యాపారాలకు ఎగబడుతున్నారని ఆయన విమర్శించారు.
విజరు మాట్లాడుతూ, ఒకానొకప్పుడు నర్సీపట్నంలో విద్యా, వైద్యం రంగాలలో అయ్యన్న అభివద్ధి చేశారని, ఈ తుగ్లక్ ప్రభుత్వం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ను మాస్క్ అడిగినందుకు చంపేశారని విమర్శించారు.రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. యువసేన రాజేష్ మాట్లాడుతూ, తాను వైసీపీలో ఉన్నప్పుడు వారిచ్చే తప్పుడు సమాచారంతోనే అయ్యన్నను విమర్శించానని, తనను క్షమించాలని కోరారు.