Mar 18,2023 01:16
మాట్లాడుతున్న సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి గంగయ్య

ప్రజాశక్తి-బాపట్ల: యువతను సిపిఎం పార్టీ పట్ల ఆకర్షితులనుచేసి ప్రజా సమస్యలపై ప్రశ్నించే దిశగా సిపిఎం పట్టణ, గ్రామ శాఖలు కృషి చేయాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు. శుక్రవారం బాపట్ల పట్టణం ఉప్పరపాలెంలో జరిగిన పార్టీ శాఖ సమావేశంలో గంగయ్య మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న కమ్యూని స్టు భావాలతో చివుకుల శేషశాస్త్రి వంటి ఉద్దండులైన కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పిం చిన బాపట్ల ఉప్పరపాలెం కమ్యూనిస్టులకు పోతుగడ్డగా నిలిచిందని గంగయ్య గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యువతను సిపిఎం పట్ల ఆకర్షితులను చేయాల న్నారు. ప్రజాహితానికి కమ్యూనిస్టు ఉద్యమాల ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ సభ్యులు, నాయకులు కృషి చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం సీనియర్‌ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ బాపట్ల ఉప్పర పాలెం అంటేనే కమ్యూనిస్టులకు పుట్టినిల్లని అన్నారు. ఉప్పరపాలేనికి చెందిన వారెందరో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎదురు తిరిగి పోరాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. తిరిగి అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే దిశగా నేటి యువతరంలో చైతన్యం కల్పించాలని కోరారు. ఆ దిశగా ఈ శాఖకు చెందిన పార్టీ సభ్యులు నాయకులు శక్తివంచన లేకుండా సిపిఎం బలోపేతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో శాఖ కార్యదర్శి షేక్‌ మహబూబ్‌ సుభాని, పార్టీ నాయకులు రాజు, వెంకారెడ్డి, అక్కల రంగారెడ్డి పాల్గొన్నారు.