
ప్రజాశక్తి-విజయవాడ : వద్ధ ఓటర్లను యువ ఓటర్లు స్ఫూర్తిగా తీసుకుని ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.అంతర్జాతీయ వద్ధుల దినోత్సవ సందర్భంగా భారత్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం నగరంలోని కలెక్టరేట్లో 80 సంవత్సరాలు పైబడి ఓటర్లైనబట్టు చిట్టమ్మ ,వి వెంకటేశ్వరరావుజొన్నలగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎస్ సాంబయ్య, కే శేషారత్నం, ఎల్ నాగరత్నం లను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు కావాలన్నారు. జిల్లాలో సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నవంబర్ నెలలో డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురించడం జరుగు తుందన్నారు. జాబితాను పరిశీలించుకుని తమ ఓటు ఏ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్నదో పరిశీలించుకోవచ్చని అలాగే 18 సంవత్సరాలు నిండిన యువత నూతన ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ ఢిల్లీ రావు విజ్ఞప్తి చేశారు.సన్మాన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ స్వప్న ల్ దినకర్ పుట్కర్, ఇన్చార్జి డిఆర్‌ఓ జి వెంకటేశ్వర్లు, ఎలక్షన్ డీటీలు రాజేశ్వరి, సురేష్ దరియా వెంకటరెడ్డి ఉన్నారు.