మాట్లాడుతున్న సిఐ సుధాకర్,
ప్రజాశక్తి-పాడేరు టౌన్: యువత సన్మార్గంలో నడవాలని పాడేరు సిఐ బి.సుధాకర్ అన్నారు. అల్లూరి జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు సిఐ సుధాకర్, పాడేరు ఎస్‌ఐలు లక్ష్మణరావు, రంజిత్ గుట్టులుపుట్టు పంచాయతీ సంతబయలు, డబ్బపుట్టు, వంతలగుమ్మి గ్రామాల్లో శనివారం పర్యటించి శాంతి భద్రతలపై గ్రామస్తులతో చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామాల పరిధిలోని కేసులను వివరిస్తూ మరల పోలీసు కేసులు పునరావృతం కాకుండా అవగాహన కల్పించారు. యువత వాహనాలు జాగ్రత్తగా నడపాలని, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని, లేకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. యువత మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించారు.










