ఘనంగా కోచ్ కృష్ణారావు జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-గాజువాక : గాజువాక పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ క్రికెట్ కోచ్ కృష్ణారావు (గాంధీ) జన్మదిన వేడుకలు శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక సీనియర్ క్రికెటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో మంది యువతకు క్రికెట్‌లో శిక్షణనిచ్చి, వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో కోచ్ కృష్ణారావు పాత్ర ఎనలేనిదన్నారు. 40ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతూ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న గాజువాక సీనియర్స్ క్రికెటర్స్ నేటి యువతకు ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. సీనియర్ క్రికెటర్స్.ఆర్గనైజింగ్‌సెక్రటరీ కసిరెడ్డి నూకరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ నేత కసిరెడ్డి సత్యన్నారాయణ, ఇడిసిఎ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీను, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.










