Aug 13,2023 22:02

విజేత జట్టుతో నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : యువత క్రీడల్లో రాణిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని వైసిపి నాయకులు వేణు రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గత వారం రోజుల నుంచి పట్టణంలోని ఎస్‌డిజిఎస్‌ కళాశాల మైదానంలో వైఎస్‌ఆర్‌ వాలంటీర్స్‌ క్రికెట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 టీంలు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆబాద్‌ పేట, రహమత్‌ పురం టీములు తలపడ్డాయి. ఈ పోటీల్లో రహమత్‌పురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బలరామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, కౌన్సిలర్లు రామచంద్ర, చంద్ర, నాయకులు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, సిపిసి సాదిక్‌, మార్కెట్‌ చాంద్‌బాషా, టోర్నమెంట్‌ ఆర్గనైజర్లు జహీర్‌, ఆయాజ్‌, దాదు ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.