Sep 13,2023 22:55

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో జాబ్‌ మేళా ఏర్పాటు చేయడం గర్వకారణమని ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుల అధికారి బి.ప్రసాద్‌ తెలిపారు.కష్ణా జిల్లా మచిలీపట్నం లో జిల్లా ఉపాధి కార్యాలయం (మోడల్‌ కెరీర్‌ సెంటర్‌), ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యభివద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నోబుల్‌ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఇయర్‌ నెస్ట్‌ అధ్యక్షతన మినీ జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.ప్రసాద్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్నా కషిని కొనియాడారు.అనంతరం జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు జాబ్‌ మేళా కి హాజరైన నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశాలను ప్రకారం మున్ముందు ఇలాంటి జాబ్‌ మేళా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు అనేక కంపెనీల ప్రతినిధులు ఈ కార్య క్రమంలో పాల్గొనటం సంతోషకరంగా ఉందన్నారు. ఈ మినీ జాబ్‌ మేళాలో 109 మంది ఇంటర్వూలకు హజరవ్వగా వారిలో 29 మంది పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఈ మేళాలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎంపికైన యువతీ,యువకులకు యంగ్‌ ప్రోబిషన్‌ ఎస్‌.జయ రాజు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కార్యాలయ సిబ్బంది వెంకటేశ్వర రావు,కళాశాల సిబ్బంది, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.