Jul 18,2023 21:39

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి

రాయచోటి : యువ ఉత్సవ్‌ లాంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదా యకంగా ఉండడంతో పాటు వారిలోని ప్రతిభ పాటవాలను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని, జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. మంగళ వారం శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కాలేజీలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతి థిగా హాజరైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, కడప నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందించారు. యువ ఉత్సవ్‌లో వచ్చిన అవకాశాన్ని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 50 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నానని రాజంపేట నియోజకవర్గ అభివద్ధికి శాయశక్తుల కషి చేస్తున్నానన్నారు. సభాధ్యక్షత వహించిన నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె. మణికంఠ మాట్లాడుతూ యువ ఉత్సవ్‌లో భాగంగా పంచప్రాణ్‌ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆజాదీకా అమత్‌ మహోత్సవ్‌ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుం దన్నారు. దేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశ స్వాతం త్య్ర పోరాటం, ఆదర్శాలు, విలువలను వ్యాప్తి చేయడానికి కార్యక్రమం మరింత దోహదపడతాయన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలో దేశంలోని యువ కళాకా రులు, రచయితలు, ఫొటోగ్రాఫర్‌లు , వక్తలను ఏర్పాటు చేయడం జరుగు తుందని చెప్పారు. విఆర్‌ విద్య సంస్థల అధినేత వెంకట రమ ణరెడ్డి మాట్లా డుతూ భారతదేశం ఇటీవల వివిధ రంగాలలో సాధించిన ముఖ్య మైన పురో గతిని ప్రదర్శించడానికి యువ ఉత్సవాలు లాంటి కార్యక్రమాలు చక్కని వేదిక న్నారు. యువత విద్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని చదువు ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. తమ కళాశాలలో చక్కటి కార్యక్ర మాన్ని నిర్వహించిన నెహ్రూ యువ కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకరరెడ్డి మాట్లాడుతూ యువ ఉత్సవ్‌లో ప్రతిభావంతులైన యువత విస్తత స్థాయిలో నిమగమై ఉన్నారని నిర్ధారిం చడా నికి, పెయింటింగ్‌, పద్యాలు, ప్రసంగం, ఫొటోగ్రఫీ, జానపద, సాంప్రదాయ కళలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట జడ్‌పిటిసి దాసరి పెంచలయ్య, మండల కన్వీనర్‌ రామ్‌మోహన్‌ నాయుడు, సాధన విద్యా సంస్థల కరస్పాండెంట్‌ బివి.రెడ్డి, నెహ్రూ యువకేంద్ర అకౌంటెంట్‌ బాబురెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.