
ప్రజాశక్తి - టి.నరసాపురం
యువత దేశభక్తిని అలవర్చుకోవాలని మండల విద్యాశాఖాధికారిణి ఎస్.కళ్యాణి తెలిపారు. శుక్రవారం నా భూమి - నా దేశం అమృత కలశ యాత్రలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో దేశ భక్తి నింపడానికే అమృత కలశ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామ పంచాయతీల నుంచి సేకరించిన అమత కలశములలోని మట్టి, బియ్యంను ఒక కలశముగా చేసి జిల్లా కేంద్రానికి పంపించనున్నట్లు ఆమె తెలిపారు. అమృత కలశ యాత్ర భావి తరాలకు ఆదర్శం కావాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకొని, ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఒఎల్ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ కెవి.గంగరాజు, సీనియర్ అసిస్టెంట్ ఎ.సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ పి.శేఖర్ బాబు, పంచాయతీ కార్యదర్శి జి.లక్ష్మినారాయణ పాల్గొన్నారు.