రోడ్డుపై పడిన చెట్లు కొమ్మలు తొలగిస్తున్న యువకులు
ప్రజాశక్తి- సీతమ్మధార : శంకరమఠం రోడ్‌లో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మ హఠాత్తుగా కూలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే మార్గమైనప్పటికీ, మధ్యాహ్న సమయంలో రోడ్డుకు అడ్డంగా భారీ కొమ్మ కూలినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం, నష్టం వాటిల్లలేదు. అయితే వాహనాలు, పాదచారుల రాకపోకలకు వీలులేనట్లుగా రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మ పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమయానికి ట్రాఫిక్ పోలీసులు కూడా లేకపోవడంతో స్థానిక యువత కొంతమంది ముందుకొచ్చి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించారు. వాహన రాకపోకలకు మార్గం సుగమం చేశారు. యువత చొరవను పలువురు పాదచారులు, వాహనదారులు అభినందించారు.










