
మృతి చెందిన సునీల్
ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : పట్టణంలోని కొత్తవలసలో గల మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ (21) షార్ట్ ఫిలింలో నటిస్తూ, దర్శకత్వం చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన తల్లి సరస్వతిని రూ. 50 వేలు ఇమ్మని అడగ్గా తమ వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో తల్లితో గొడవపడి అదే రోజు రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు తల్లి సరస్వతి శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నారాయణ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గల మెప్మాలో ఆర్‌పిగా విధులు నిర్వహిస్తున్నారు.