ప్రజాశక్తి - దేవరాపల్లి: దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన జామి సింహాచలంనాయుడు (28) అనే యువకుడు ఆదివారం ఉదయానికి శారదానది ఒడ్డున చెట్టుకొమ్మకు ఉరేసుకుని అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు తన కుమారుడిని . ఎవరో ఉరివేసి శారదా నది ఒడ్డున చెట్టుకొమ్మకు వేలాడదీసారని, తన బిడ్డ మృతికి కారణాలు తెలియజేయండి అంటూ ఆదివారం బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కె.కోటపాడు సిఐ ఎస్.తాతారావు, ఇంచార్జ్ ఎస్‌ఐ రామకృష్ణ, వెల్లడించిన వివరాలివి.
ఆదివారం తెల్లవారుజామున శారదా నది ఒడ్డున బహిర్భూమికి వెళ్లిన స్థానికులకు చెట్టు కొమ్మకు ఉరేసుకుని జామి సింహాచలంనాయుడు (28) మృతి చెందిఉండడాన్ని గుర్తించారు. విషయాన్ని మృతుని తల్లి సింహాచలమ్మకు తెలియజేయగా, ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది, దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. సింహాచలం మరణ వార్త విన్న బంధువులు ఆ శారదా నది ఒడ్డీకి చేరుకొని బోరున విలపించసాగారు. మృతుడికి తల్లి, అక్క, తమ్ముడు ఉన్నారు. తండ్రి రాజునాయుడు మరణం తర్వాత సొంత ట్రాక్టర్ కొనుగోలు చేసి, కుటుంబపోషణ బాధ్యతలను సింహాచలమే చూస్తున్నాడు. కాగా యువకుని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.










