Sep 09,2023 23:30

ప్రజాశక్తి - బాపట్ల
కంటి చూపు సక్రమంగా లేకపోయినా కూలి పనికి వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడి కాలుతుంటి విరిగి మంచానికే పరిమితమైన నిరుపేద యువకుడికి శనివారం ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ టీం ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ గౌరవ అధక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో దేవుడు మాన్యంకు చెందిన కీర్తి గోపి అనే యువకుడికి కంటిచూపు సక్రమంగా లేక దీనికి తోడు కాలుతుంటే విరిగి  వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధపడుతున్న యువకుడికి ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ రూ.5వేలు ఆర్థిక సహాయం అంద చేయడం జరిగిందన్నారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక స్థితులను గుర్తించి దాతలు ముందుకు రావాలని కోరారు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అండగా నిలుస్తుంది అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణ, చల్లా శ్రీనివాసరావు, బీమా కోటేశ్వరరావు, యాశం రాజ రమేష్, కోటికలపూడి జయరాం, నరాలశెట్టి నాగరాజు, విన్నకోట శ్రీనివాసరావు పాల్గొన్నారు.