Jul 14,2023 21:31

హత్యకు గురైన నాగేంద్రబాబు

ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : మండలంలో దారుణ హత్య జరిగింది. శుక్ర వారం తెల్ల వారుజా మున మండ లంలోని కొత్తపల్లి పంచా యతీ కానాపల్లి ఎస్‌సి కాలనీకి చెందిన ఆకుమల్ల నాగేం ద్రబాబు (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. రాత్రి ఇంటిపై నిద్రిస్తున్న మృతుడు ఉదయం కిందికి రాకపోవడంతో అతని సతీమణి ఇమామ్‌బీ మిద్దెపైకి వెళ్లిచూడగా రక్తపు మడుగులో పడిఉన్న భర్తను చూసి కేకలు వేసింది. వెంటనే స్థానికులు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగేంద్రబాబు నాలుగేళ్ల కిందట షేక్‌ ఇమా మ్‌బీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మతుడు గ్రానైట్‌ పనులు చేస్తూ జీవనం కొన సాగిస్తుండేవాడు. మతదేహాన్ని రూరల్‌ పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీలా ఉండగా నాగేంద్రబాబు నెల కిందట తన తోటి కూలితోనూ, వారం కిందట తన స్వగ్రామంలోనే స్థానికులతో గొడవ పడినట్లు తెలిసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పై రెండు కోణాల్లో విచారిస్తున్నారు.