Jan 09,2023 22:48

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన 36వ దక్షిణ ప్రాంతీయ అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో భాగంగా జనవరి మొదటి వారంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో కష్ణా విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించిన తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వివిధ అంశాల్లో బహుమతులు సాధించినట్లు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు. డిసెంబర్‌ నెలలో కృష్ణా విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్‌ కళాశాలల యువజనోత్సవాల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన తమ కళాశాల సాంస్కృతిక విభాగం విద్యార్థినీ, విద్యార్థులు సౌత్‌ జోన్‌ పోటీల్లోనూ రాణించి శాస్త్రీయ గానంలో ప్రథమ బహుమతి, భారతీయ బందగాన పోటీల్లో ప్రథమ బహుమతి, మెహందీ అలంకరణలో ప్రధమ బహుమతి, శాస్త్రీయ సంగీత వాయిద్య పోటీల్లో ద్వితీయ బహుమతి, లలిత సంగీతంలో ద్వితీయ బహుమతి, రంగవల్లుల పోటీల్లో ద్వితీయ బహుమతి, జానపద సంగీత వాద్య పోటీల్లో తతీయ బహుమతి సాధించి సత్తా చాటినట్లు కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబురావు తెలిపారు. సౌత్‌ జోన్‌ పోటీలలో విజయం సాధించిన తమ కళాశాల విద్యార్థులు కష్ణా విశ్వవిద్యాలయం తరపున ఫిబ్రవరి చివరి వారంలో బెంగళూరు జైన్‌ విశ్వవిద్యాలయంలో జరిగే జాతీయస్థాయి అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో పాల్గొంటారని వెల్లడించారు. గడచిన నాలుగేళ్లుగా కష్ణా విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించటంతో పాటు భారతీయ విశ్వవిద్యాలయాల సమాఖ్య నిర్వహిస్తున్న ప్రాంతీయ, జాతీయస్థాయి యువజనోత్సవాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్న సాంస్కృతిక విభాగం అధ్యాపకులు డాక్టర్‌ బి.జయప్రకాష్‌, శివరంజని, నాగ శశాంక, విద్యార్థినీ విద్యార్థులను సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్‌ సూరెడ్డి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్‌ రాజేష్‌ సి జంపాల అభినందించారు.