ప్రజాశక్తి-విజయవాడ రూరల్
తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళంతో వైకాపా వెన్నులో వణుకు మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర లు పేర్కొన్నారు. గొల్లపూడి కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27న కుప్పం నుంచి మొదలవుతున్న యువగళం పాదయాత్రకు ఆటంకాలు సష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చెన్నుపాటి గాంధీ, బాబా ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు), డూండీ రాకేష్, గూడపాటి పద్మశేఖర్, నూతులపాటి వెంకటేశ్వరరావు (నారద) పాల్గొన్నారు.










