ప్రజాశక్తి - చిప్పగిరి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, టిడిపి నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇక టిడిపికి తిరుగుండదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఆలూరు మాజీ ఇన్‌ఛార్జీ వైకుంఠం మల్లికార్జున చౌదరి, టిడిపి కన్వీనర్ లాయర్ షేక్షావలీ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ తెలిపారు. మంగళవారం చిప్పగిరిలో టిడిపి నాయకులు బర్మీ భోజరాజు నిర్వహించిన శ్రీపెద్దమ్మ అవ్వ దేవరకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. టిడిపి సీనియర్ నాయకులు గుర్రం దేవేంద్రప్ప, భీమలింగప్ప, ఉమాపతి నాయుడు, అమరేష్, శివలింగ, గుర్రం అనిల్, జహీర్, కొండ రామాంజిని, గురు గోపాల్, జయరాముడు, నాగరాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
మల్లికార్జున చౌదరికి స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు










