Sep 07,2023 21:45

మాట్లాడుతున్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకటరావు

ప్రజాశక్తి-వీరఘట్టం : నారా లోకేష్‌ చేపడుతున్న యువగళం పాదయాత్రపై వైసిపి గూండాలు దాడులు చేస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. గురువారం మండలంలోని కిమ్మి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెప్పుతారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన మొదలై నాలుగేళ్ల నాలుగు నెలలు పూర్తికావస్తుందని, మరో ఆరు నెలలు ఓపిక పడితే జగన్‌ పీడ రాష్ట్రానికి వీడనుందని చెప్పారు. సమావేశంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌ , ఎన్‌.శశికుమార్‌, సిహెచ్‌ మహేశ్వరరావు పాల్గొన్నారు.